జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీమ్ సమావేశం నిర్వహించారు. ఇటీవల కురిసిన వర్షాలతో రహదారులకు, పంటలకు తీవ్రంగా నష్టం కలిగిందని... అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండడం వల్లే.. ప్రాణ నష్టాన్ని నివారించగలిగామని కలెక్టర్ తెలిపారు. ఇదే తరహాలో అధికారులందరూ... దెబ్బతిన్న రహదారులు, వంతెనలకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని సూచించారు. అదేవిధంగా శాశ్వతంగా రోడ్ల నిర్మాణ పనులకు నివేదికలు సిద్ధం చేయాలని ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు.
అధిక వర్షాల వల్ల జిల్లాలో జరిగిన పంట, ఆస్తి నష్టంపై చర్చించి తగు ఆదేశాలు జారీ చేశారు. వానల కారణంగా జిల్లాలో వరి, పత్తి తదితర పంటలు దెబ్బతిన్నాయని... వాటి విలువ సుమారు రూ.16 కోట్ల 25 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. వర్షాలతో నష్టపోయిన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చేలా వెంటనే నివేదికలు తయారు చేసి చర్యలు చేపట్టాలని సూచించారు.