జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి, గణపురం, రేగొండ, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి మండలాల్లో జోరుగా ఓటింగ్ కొనసాగుతోంది. భూపాలపల్లి పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య పరిశీలించగా... రేగొండ, చిట్యాల పోలింగ్ కేంద్రాల్ని ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్, రాష్ట్ర ఎన్నికల పరిశీలన అధికారి రవి కిరణ్ పరిశీలించారు. ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 21.75 శాతం పోలింగ్ నమోదైంది.
భూపాలపల్లిలో జోరుగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ - తెలంగాణ లేటెస్ట్ న్యూస్
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పోలింగ్ కేంద్రాలను పోలీసులు, అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. భూపాలపల్లి పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ కృష్ణ ఆదిత్య పరిశీలించారు. జిల్లాలో మధ్యాహ్నం 12 గంటల వరకు 21.75 శాతం ఓటింగ్ నమోదైంది.
నిరంతరం పర్యవేక్షణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
జిల్లాలోని మొత్తం 18 పోలింగ్ కేంద్రాల్లో 12,976 ఓట్లు ఉన్నాయి. ఎన్నికల కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పట్టభద్రులు ఓటేస్తున్నారు. పోలింగ్ కేంద్రాలను పోలీసులు, అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
TAGGED:
mlc elections latest news