ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా అదనపు ఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. ఉల్లంఘిస్తే కేసులతో పాటు, జరిమానా విధిస్తామని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో గుంపులుగా చేరవద్దని, అనవసర విందులు నిర్వహించవద్దని కోరుతూ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
మాస్క్ మస్ట్.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలే: అదనపు ఎస్పీ - తెలంగాణ వార్తలు
అందరూ విధిగా మాస్క్ ధరించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా అదనపు ఎస్పీ శ్రీనివాసులు సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా కట్టడిలో భాగంగా స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు.
మాస్క్ తప్పనిసరి, కరోనా నిబంధనలపై అదనపు ఎస్పీ హెచ్చరిక
కరోనా వైరస్ నిర్మూలనలో అందరూ భాగం కావాలని.. నిరభ్యంతరంగా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలతో పాటు రూ.1000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. మాస్కు ధరించకపోతే వారి ప్రవేశాన్ని నిషేధించాలని దుకాణాలు, కార్యాలయాలకు సూచించారు. స్వీయ నియంత్రణ పాటిస్తూ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.