పోలీస్ స్టేషన్ల వారిగా దర్యాప్తులో ఉన్న కేసులను తగ్గించుటకు అధికారులంతా బాధ్యతగా పనిచేయాలని... జయశంకర్ భూపాలపల్లి అదనపు ఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. కేసుల దర్యాప్తు విషయంలో పారదర్శకంగా పని చేసి బాధితులకు భరోసా కల్పించే విధంగా స్పందించాలని పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో అధికారులతో ఆయన సమావేశమయ్యారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
'ఫిర్యాదు దారుల పట్ల మర్యాదగా మెలగాలి'
పోలీస్ శాఖలో వినియోగిస్తున్న నూతన టెక్నాలజీపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని... జయశంకర్ భూపాలపల్లి అదనపు ఎస్పీ శ్రీనివాసులు అన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండి ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులతో ఆయన సమావేశమయ్యారు.
'ఫిర్యాదు దారుల పట్ల మర్యాదగా మెలగాలి'
పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదు దారుల పట్ల మర్యాదగా మెలగాలని ఆయన కోరారు. ప్రజలతో ఎప్పటికప్పుడు మమేకమవుతూ సత్సంబంధాలు కలిగి ఉండాలన్నారు. అత్యవసర సమయంలో డయల్ 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. హెచ్ఆర్ఎంఎస్ అప్లికేషన్ ద్వారా పోలీస్ శాఖలో కాగిత రహిత సేవలు అందించడం సాధ్యమవుతోందని తెలిపారు. దీని ద్వారా ఉద్యోగులకు పారదర్శకంగా సేవలందించవచ్చని అన్నారు.
ఇదీ చదవండి: పాడె మోసిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
TAGGED:
telangana latest news