ఘనపురం మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఎమ్మెల్యే గండ్ర ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. ఉపాధ్యాయులు విధులకు హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అన్ని వసతులు కల్పించినా పట్టించుకోకపోవడం ఏంటని మండిపడ్డారు. ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండ చూసుకోవాలని సూచించారు.
విధులకు ఉపాధ్యాయులు గైర్హాజరు.. గండ్ర ఆగ్రహం - ముఖ్యమంత్రి కేసీఆర్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపురం మండలంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి పర్యటించారు. 7 కోట్ల 24 లక్షలతో నిర్మిస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

విధులకు ఉపాధ్యాయులు గైర్హాజరు.. గండ్ర ఆగ్రహం
విధులకు ఉపాధ్యాయులు గైర్హాజరు.. గండ్ర ఆగ్రహం
ఇదీ చదవండి: భార్య అసహజ కోరికలు.. తీశాయి భర్త ప్రాణాలు!
TAGGED:
mla gandra venkaramana reddy