తెలంగాణ

telangana

ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న రేషన్​ బియ్యం పట్టివెత - పీడీఎస్​ బియ్యం పట్టివెత

ప్రభుత్వం ఇచ్చిన ఉచిత బియ్యాన్ని సేకరించి అక్రమ దందా నిర్వహిస్తున్న వ్యక్తిని జయశంకర్​ భూపాలపల్లి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 250 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

Jayashankar Bhupalapally police Caught Illegal PDS Rice
అక్రమంగా తరలిస్తున్న రేషన్​ బియ్యం పట్టివెత

By

Published : Jul 7, 2020, 9:44 AM IST

కరోనా వ్యాధి విస్తరిస్తున్న క్రమంలో లాక్​డౌన్ అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పేదలు ఇబ్బంది పడకుండా రేషన్​ కార్డు మీద గత మూడు నెలలుగా ఉచిత బియ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఇదే అదునుగా భావించిన కొందరు కేటుగాళ్లు ఉచిత రేషన్​ బియ్యాన్ని సేకరించి.. పక్కదారి పట్టిస్తున్నారు. జయశంకర్​ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన 250 క్వింటాళ్ల పీడీఎస్​ బియ్యాన్ని పక్క సమాచారంతో పోలీసులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు.

మండల కేంద్రానికి చెందిన సాంబయ్య అనే వ్యక్తి పీడీఎస్​ బియ్యాన్ని సేకరించి అక్రమంగా బ్లాక్​లో అమ్ముతున్నాడని తెలుసుకున్న పోలీసులు తనిఖీలు చేసి రూ.10 లక్షలు విలువ చేసే బియ్యం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి.. కేసు నమోదు చేసి.. బియ్యాన్ని రెవిన్యూ అధికారులకు అప్పగించినట్టు ఎస్సై రాజన్​ బాబు తెలిపారు. మండలంలో ఎవరైనా అక్రమ దందా చేస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.

ఇదీ చూడండి:చేనేత రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు: కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details