తెలంగాణ

telangana

ETV Bharat / state

నిర్లక్ష్యంగా ధాన్యం కొనుగోళ్లు.. రైతుల ఇబ్బందులు - ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల ఇబ్బందులు

ధాన్యం పండించడం, దాన్ని కాపాడుకోవడం, కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి... విక్రయించే దాకా రైతులు బిక్కు బిక్కు మంటూ గడపాల్సి వస్తోంది. మిల్లర్లు కొనుగోలు చేసి డబ్బులు ఖాతాలో పడేంత వరకు కష్టానికి ఫలితం దక్కుతుందన్న నమ్మకం లేకుండా పోయింది.

jayashankar bhupalapally farmers facing problems in paddy purchase centers
నిర్లక్ష్యంగా ధాన్యం కొనుగోళ్లు.. రైతుల ఇబ్బందులు

By

Published : May 26, 2020, 2:49 PM IST

పంట పండించడం ఒకెత్తైతే... అమ్ముకోవడం ఓ సవాలు గా మారిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి, రేగొండ, చిట్యాల, మొగుల్లపల్లి మండలాల్లోని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు దోపిడీ, నిర్లక్ష్యంతో నడుస్తున్నాయని రైతులు వాపోతున్నారు. నిర్వాహకులు ఇష్టారీతిన నడిపిస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే... రోజులు గడుస్తున్నా ఏదో సాకుతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఓ పక్క ప్రకృతి సహకరించక... ఉరుములు, మెరుపులతో కురుస్తున్న వర్షాలతో ఆందోళ చెందుతున్నారు. కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యానికి తేమ చూసి, వెంటనే కాంటా పెట్టి మిల్లర్లకు పంపించి డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చూడండి:ఈ నెల 29న కొండపోచమ్మ జలాశయం ప్రారంభం: హరీశ్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details