బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు... బాలల హక్కులను కాలరాసి వారి జీవితాన్ని నాశనం చేస్తున్నాయని జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి అంగన్వాడీ టీచర్లు గ్రామంలో పర్యటించి వీటికి సంబంధించిన వివరాలను... ఉన్నతాధికారులకు నివేదించాలని ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో ఐసీడీఎస్, ఐసీపీఎస్, సఖి కేంద్రం నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు.
ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి...
అణచివేతకు గురైన మహిళలను చేరదీసి వారి సంరక్షణ చేపట్టేందుకు సఖి కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహిళలకు సహాయ సహకారాలు అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. మహిళలపై వేధింపులు జరగకుండా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు.