తెలంగాణ

telangana

ETV Bharat / state

చిట్యాల సీహెచ్​సీకి రాష్ట్రస్థాయి అవార్డు.. కలెక్టర్ అభినందన

ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ.. వైద్య సేవలు అందించడమే గాక స్వచ్ఛ భారత్​లో భాగంగా పారిశుద్ధ్య నిర్వహణ కూడా బాగా నిర్వహించినందుకు జయశంకర్​  భూపాలపల్లి జిల్లా చిట్యాల కమ్యూనిటీ హెల్త్​ సెంటర్​ కాయకల్ప అవార్డులో రెండో స్థానంలో నిలిచింది. జిల్లా కలెక్టర్ మహమ్మద్​ అబ్దుల్​ అజీమ్​ చిట్యాల కమ్యూనిటీ హెల్త్​ సెంటర్​ సిబ్బందికి అభినందనలు తెలిపారు.

Jayashankar Bhupalapally Collector Appreciate to Chityal Community Health Center Staff
చిట్యాల సీహెచ్​సీకి రాష్ట్రస్థాయి అవార్డు.. కలెక్టర్ అభినందన

By

Published : Sep 25, 2020, 9:21 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని చిట్యాల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కాయకల్ప అవార్డులో రాష్ట్రస్థాయి రెండో స్థానాన్ని పొందడంపై వైద్యారోగ్య శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీమ్ అభినందనలు తెలిపారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా చిట్యాల ఆస్పత్రిలో పారిశుద్ధ్య కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించారని గుర్తు చేశారు.

వైద్య సిబ్బంది నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలను అందిస్తూ.. ప్రభుత్వ వైద్యసేవలపై ప్రజల్లో నమ్మకం కలిగించిందని.. అందుకే.. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ 2019-20 సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సీహెచ్​సీ కేటగిరిలో రాష్ట్రంలోనే రెండో స్థానం లభించిందని కలెక్టర్​ అన్నారు.

వైద్య సేవలను అందించడమే గాక.. పారిశుద్ధ్య కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులను, సిబ్బందిని అభినందించారు. జిల్లాలో ఉత్తమ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా రేగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రశంసనీయ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుగా మహదేవపూర్ మండలంలోని అంబటిపల్లి, టేకుమట్ల మండలంలోని వెలిశాల, మహాముత్తారం, మొగుళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఎన్​యూహెచ్​ఎం కింద భూపాలపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రం ఎంపికైనట్టు జిల్లా కలెక్టర్ తెలిపారు.

ఇదీ చూడండి:రాష్ట్రంలో త్వరలోనే పూర్తిస్థాయి వైద్య సేవలు: ఈటల

ABOUT THE AUTHOR

...view details