దాడులకు, హింసకు గురైన మహిళలను తరలించడానికి సఖి కేంద్రం ద్వారా ఏర్పాటు చేసిన 181 అంబులెన్స్ సర్వీసును జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహహ్మద్ అబ్దుల్ అజీమ్ ప్రారంభించారు. మహిళలు ఎవరు అత్యాచారాలకు, అణిచివేతకు గురికాకుడదనే ప్రధాన ఉద్దేశంతో సఖి కేంద్రం నిర్వహిస్తున్నామని తెలిపారు.
'మహిళలు ఎవరు అత్యాచారాలకు గురికాకూడదు' - సఖి కేంద్రాలకు అంబులెన్స్ సర్వీసులు
మహిళల సంరక్షణకై మోడల్ కేంద్రంగా సఖి కేంద్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీమ్ తెలిపారు. మహిళలు వేధింపులకు, దాడులకు గురైనప్పుడు.. ముందుకు వచ్చి ఈ అంబులెన్స్ సౌకర్యాన్ని వాడుకోవాలని సూచించారు.
!['మహిళలు ఎవరు అత్యాచారాలకు గురికాకూడదు' jayashankar bhpalapally collector starts ambulance services for sakhi center](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7555693-831-7555693-1591777477512.jpg)
'మహిళలు ఎవరు అత్యాచారాలకు గురికాకూడదు'
బాధిత మహిళలను గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడమే కాకుండా... లీగల్కూడా సహకారం అందిస్తామని... బాధిత మహిళకు న్యాయం జరిగేలా చేస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు. సఖి కేంద్రం బలోపేతానికి జిల్లా కలెక్టర్గా పూర్తి మద్దతు ఇస్తామన్నారు. అదేవిధంగా జిల్లాలో మహిళలు, దివ్యాంగులకు ఎలాంటి సహకారం కావాలన్నా తమ వంతు సాయం అందిస్తున్నామని తెలిపారు.
ఇవీ చూడండి:'కొన్నాళ్లు ఉద్యోగాల భర్తీ నిలిపేయటం తప్పదు'