తెలంగాణ

telangana

ETV Bharat / state

చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు: అదనపు ఎస్పీ - అదనపు ఎస్పీ పోలీసులకు సూచనలు

జిల్లాలో చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని జయశంకర్​ భూపాలపల్లి జిల్లా అదనపు ఎస్పీ వి.శ్రీనివాసులు సూచించారు. పోలీసుశాఖలో వినియోగిస్తున్న ఆధునిక సాంకేతికతపై సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలన్నారు. జిల్లాపోలీసు కార్యాలయంలో అధికారులతో నేరసమీక్షా సమావేశం నిర్వహించారు.

Jayasankar bhupalapalli Additioanal SP review law and order in district
చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు: అదనపు ఎస్పీ

By

Published : Nov 27, 2020, 5:21 PM IST

సంఘటన జరిగాక స్పందించే రియాక్టివ్​ పోలీసింగ్ కంటే జరగకముందే నిఘా ఉంచేలా ప్రోయాక్టివ్ పోలీసింగ్​పై దృష్టి సారించాలని పోలీసు అధికారులకు అదనపు ఎస్పీ వి.శ్రీనివాసులు సూచించారు. జయశంకర్​ భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని కార్యాలయంలో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో నమోదైన కేసుల వివరాలు, దర్యాప్తు, పురోగతి అంశాలపై చర్చించారు. పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు దర్యాప్తు పూర్తిచేసి నిందితులను న్యాయస్థానాల్లో ప్రవేశపెట్టాలా చర్యలు తీసుకోవాలన్నారు.

పోలీసుశాఖలో వినియోగిస్తున్న ఆధునాతన సాంకేతికతపై సిబ్బందికి పూర్తిస్థాయి అవగాహన ఉండాలన్నారు. జిల్లావ్యాప్తంగా మహిళలు, యువతులపై ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడిన కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిపై నిఘా ఉంచి, శాంతిభద్రతలను కాపాడాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి, కాటారం డీఎస్పీలు ఏ.సంపత్​రావు, బోనాల కిషన్​, శిక్షణ ఐపీఎస్ సుధీర్ రామ్​నాథ్​ కేకన్​, ఎస్సైలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:హైదరాబాద్ అభివృద్ధి కావాలంటే భాజపాకు పట్టం కట్టండి: బండి

ABOUT THE AUTHOR

...view details