జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ వారి సీఎస్ఆర్ నిధులతో వైద్య, ఆరోగ్య శాఖలో వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ సుధార్ సింగ్‌ను ఆదేశించారు. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ కార్యక్రమంలో ఉమ్మడిగా ఎంపికైన జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వైద్య సదుపాయాల కల్పనకు గత సంవత్సరం పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ వారి సీఎస్ఆర్ నిధుల నుంచి రూ.8 కోట్ల 74 లక్షల నిధుల నుంచి పది శాతం ఖర్చు చేశామని, లాక్డౌన్ వల్ల మిగతా నిధులను సకాలంలో ఖర్చు చేయకపోయామని తెలిపారు.
వైద్యశాఖ అధికారులతో.. కలెక్టర్ సమీక్షా సమావేశం! - జయశంకర్ భూపాలపల్లి జిల్లా వార్తలు
పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ వారి సీఎస్ఆర్ నిధులతో వైద్య, ఆరోగ్య శాఖలో వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన జిల్లా వైద్య శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
![వైద్యశాఖ అధికారులతో.. కలెక్టర్ సమీక్షా సమావేశం! Jaya Shankar Bhupalapally Collector meeting With Medical And Health Officials](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8669231-715-8669231-1599153136869.jpg)
జిల్లా అధికార యంత్రాంగం విజ్ఞప్తి మేరకు పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ సంబంధిత నిధులతో జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వైద్య సదుపాయాల కల్పనకు మరో ఆరు నెలల వ్యవధి ఇవ్వడానికి అంగీకరించిందని తెలిపారు. బై డిస్ట్రిక్ లెవెల్ టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేసి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సీఎస్ఆర్ నిధులతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య పరికరాలు, ఫర్నిచర్, అంబులెన్స్‌ల కొనుగోలుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో కన్సల్టెంట్ నారాయణ, డీఐఓ డాక్టర్ ఉమాదేవి, కరోనా వైరస్ నియంత్రణ కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ జైపాల్, డాక్టర్ భాష్య నాయక్, సీపీఓ బిక్షపతి, కలెక్టరేట్ ఏవో మహేష్ బాబు, సూపరింటిండెంట్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:లారీని ఢీకొట్టిన కారు... సర్పంచ్ సహా ఇద్దరు మృతి