గోదావరి నదికి ప్రాణహిత నుంచి వరద రాకను అంచనా వేయడానికి కాళేశ్వరం, ఎస్సారెస్పీ ప్రాజెక్టు ఇంజినీర్ల ఆధ్వర్యంలో ఎగువ ప్రాంతాల్లో క్యాచ్‌మెంట్ స్థలాలను గుర్తిస్తూ డిశ్ఛార్జి గేజ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లాలో ప్రాణహిత ప్రవేశించిన చోటు నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీ వరకు 156 కిలోమీటర్ల మేర రెండు నదులపై 12 చోట్ల వీటిని అమర్చారు. వీటిని కేంద్ర జల సంఘానికి అనుసంధానించారు.
ప్రాణహిత నుంచి గోదావరికి నీటి ప్రవాహం అంచనాకు సూచీలు
గోదావరి నదికి ప్రాణహిత నుంచి వరద రాకను అంచనా వేయడానికి సూచికలు ఏర్పాటు చేశారు. ప్రాణహిత, గోదావరి నదులపై డిశ్ఛార్జి గేజ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెండు నదులపై 12 చోట్ల వీటిని అమర్చారు. వీటిని కేంద్ర జల సంఘానికి అనుసంధానించారు.
కాళేశ్వరం ఈఎన్‌సీ నల్ల వెంకటేశ్వర్లు, సీఈ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సారెస్పీ సీఈ శంకర్, ఈఎన్‌సీ అనిల్‌కుమార్, ఈఎన్‌సీ నాగేందర్‌ల పర్యవేక్షణలో ప్రాణహిత నదిపై మంచిర్యాల జిల్లాలోని వెంకట్రావుపేట, గూడెం, ముప్పిడిగూడెం, పెద్దవాగు తదితర ప్రాంతాలతో పాటు గోదావరిపై కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన దిగువన, ఏటూరునాగారం ముళ్లకట్ట వద్ద డిశ్ఛార్జి గేజ్‌లు ఏర్పాటు చేశారు. గేజ్‌ల ఏర్పాటుతో ఎగువ నుంచి వచ్చే ప్రవాహాన్ని అంచనా వేస్తూ మేడిగడ్డ బ్యారేజీ వద్ద గేట్ల ఎత్తవేత, లక్ష్మీ పంపుహౌస్ మోటర్లు నడిచే ప్రక్రియను క్రమబద్ధీకరించనున్నట్లు కాళేశ్వరం ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు చెప్పారు.
ఇదీ చదవండి :రాష్ట్రంలో కొత్తగా 1,178 కరోనా కేసులు