జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోలీసులకు మాస్కులు, శానిటైజర్లు, ఇమ్యూనిటీ బూస్టర్స్ మందులను అందజేశారు. 24 గంటలు విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు కరోనా నియంత్రిణ కిట్లు అందజేయడం అభినందనీయమని ఆదనపు ఎస్పీ వి. శ్రీనివాసులు అన్నారు. ప్రజలంతా లాక్‌డౌన్ నిబంధనల్ని పాటించాలని... అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు.
ఐఎంఏ ఆధ్వర్యంలో కరోనా కిట్లు పంపిణీ - ఐఎంఏ వరంగల్ శాఖ ఆధ్వర్యంలో శానిటైజర్ల పంపిణీ
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసులకు మాస్కులు, శానిటైజర్లు, రోగ నిరోధక శక్తి మాత్ర లను అందజేశారు.
![ఐఎంఏ ఆధ్వర్యంలో కరోనా కిట్లు పంపిణీ ima distributed sanitizers and masks immunity booster medicines to bhupalpally police](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6846061-thumbnail-3x2-wgl.jpg)
ఐఎంఏ ఆధ్వర్యంలో కరోనా కిట్లు పంపిణీ
ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డీఎస్పీ ఎ. సంపత్ రావు, సీఐ వాసుదేవరావు, ఐఎంఏ వరంగల్ శాఖ అధ్యక్షులు డా. కొత్తగట్టు శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ డా. లక్ష్మీనారాయణ, కోశాధికారి డా. ఆశ్రిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:'ప్లాస్మా చికిత్స' క్లినికల్ ట్రయల్స్‌కు లైన్ క్లియర్!