తెలంగాణ

telangana

By

Published : May 29, 2021, 3:23 PM IST

ETV Bharat / state

Alcohol: 'మద్యం అక్రమ వ్యాపారంపై చర్యలు తీసుకోవాలి'

భూపాలపల్లిలో అక్రమ మద్యం వ్యాపారంపై అధికారులు ఎందుకు స్పందించడం లేదని తెలంగాణ జాగృతి నేత మాడ హరీశ్​ రెడ్డి నిలదీశారు. ఎక్సైజ్, పోలీస్​ అధికారుల సహాయంతోనే ఈ దందా నిర్వహిస్తున్నారని ఆరోపించారు. లాక్​డౌన్ (Lock down)​ వేళ మద్యం ధరలు పెంచి అమ్ముతున్నారని తెలిపారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

Illegal liquor business
Alcohol: 'మద్యం అక్రమ వ్యాపారంపై చర్యలు తీసుకోవాలి'

ఎక్సైజ్ అధికారులకు ప్రభుత్వం ఇచ్చే జీతాలు సరిపొకుంటే మమ్మల్ని సంప్రదించండి భిక్షాటన చేసి డబ్బులు ఇస్తాం. అంతే కానీ మద్యం సిండికేట్ వ్యాపారుల దగ్గర మాముళ్లకు ఆశపడి ప్రజల జీవితాలతో చెలగాటం అడొద్దని తెలంగాణ జాగృతి నేత మాడ హరీశ్​ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఎక్సైజ్ అధికారుల భాగస్వామ్యంతో మద్యం అధిక ధరలకు అమ్ముతున్నారని ఆరోపించారు.

భూపాలపల్లిలో ఏడు వైన్ షాపులు ఉన్నాయని... వాటికి వచ్చే మద్యాన్నిఆయా దుకాణాల్లోనే నిల్వ చేసుకోవాలని తెలిపారు. కానీ సదురు వ్యాపారులు సిండికేట్​గా ఏర్పడి ఎక్సైజ్ శాఖ సహకారంతో అక్రమంగా మద్యం నిల్వలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడి నుండే సుమారుగా 300 వందల బెల్టు షాపులకు అధిక ధరలకు డోర్ డెలివరీ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ అక్రమ దందాకు ఎక్సైజ్, పోలీసు శాఖ అధికారులు సాయం చేస్తున్నారని తెలిపారు.

లాక్​డౌన్(Lock down)​ నిబంధనలు పాటించకుండా రాత్రి, పగలు బెల్టు షాపులకు అధిక ధరలకు మద్యాన్ని సరఫరా చేస్తున్నా… అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బెల్టు షాపుల వ్యాపారులు లాక్​డౌన్(Lock down)​ ​ని ఆసరాగా చేసుకుని ధరలు పెంచి సామాన్య ప్రజలను దోచుకుంటున్నారని వెల్లడించారు.

పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బెల్టు షాపులపై చర్యలేవని ప్రశ్నించారు. ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యాంగ వ్యవహరిస్తున్న వైన్ షాపులను సీజ్ చేయాలని డిమాండ్​ చేశారు. జిల్లాలో బెల్టు షాపులు, మద్యం సిండికేట్ అక్రమ వ్యాపారంపై ఎక్సైజ్ శాఖ అధికారులు స్పందించక పోతే కలెక్టర్​కు ఫిర్యాదు చేసి… ఆయన ఆదేశాలతో ఆ కేంద్రాలపై దాడులు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలొ చీకటి గణేశ్​, పెరటి అభిలాష్ రెడ్డి, తుండ్ల గణేశ్​, మేకల ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:Suicide: కొవిడ్​తో తల్లి మృతి.. సరైన వైద్యం అందలేదంటూ కొడుకు ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details