తెలంగాణ

telangana

ETV Bharat / state

'అధికారుల కనుసన్నల్లోనే అధిక ధరలకు మద్యం విక్రయాలు' - telangana news

లాక్​డౌన్ సమయంలో అక్రమంగా మద్యం విక్రయాలు జరుగుతున్నా ఆబ్కారీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని తెలంగాణ జాగృతి నాయకుడు మాడ హరీశ్ రెడ్డి ఆరోపించారు. వ్యాపారులంతా సిండికేట్ అయి.. మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు.

telangana jagruthi, liquor sales, illegal liquor sales
తెలంగాణ జాగృతి, భూపాలపల్లిలో మద్యం దందా, భూపాలపల్లిలో అక్రమ మద్యం విక్రయాలు

By

Published : May 30, 2021, 7:58 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా.. ఆబ్కారీ శాఖ అధికారుల సాయంతో అధిక ధరలు మద్యం విక్రయాలు జరుగుతున్నాయని తెలంగాణ జాగృతి నాయకుడు హరీశ్ రెడ్డి ఆరోపించారు. వ్యాపారులంతా సిండికేట్ అయి..మద్యాన్ని అక్రమంగా అధిక ధరలకు విక్రయిస్తున్నారని తెలిపారు. ఇదంతా తెలిసి కూడా ఆబ్కారీ అధికారులు.. చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

లాక్​డౌన్ సమయంలోనూ.. నిబంధనలు ఉల్లంఘించి మద్యం విక్రయాలు జరుపుతున్నారని హరీశ్ రెడ్డి ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ అక్రమాలను అడ్డుకోవాలని కోరారు. లేనియెడల కలెక్టర్​కు ఫిర్యాదు చేసి.. ఆయన ఆదేశాలతో బెల్డ్ షాపులపై దాడులు నిర్వహిస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details