తెలంగాణ

telangana

ETV Bharat / state

గిరిపుత్రుని ఘనత

అభివృద్ధికి దూరంగా ఉన్న తండాలో పుట్టి, అరకొరవసతుల మధ్య చదువు సాగించాడు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆ గిరిపుత్రుడు ఒక్కోమెట్టు ఎక్కుతూ వ్యవసాయ శాస్త్రవేత్త అయ్యాడు. సివిల్స్​పై మక్కువతో కష్టపడి చదివి ఇండియన్ ఫారెస్ట్ సర్వీసులో 76వ ర్యాంకు సాధించాడు.

ఐఎఫ్​ఎస్​ ఫలితాల్లో 76 ర్యాంకు సాధించిన నరసింహస్వామి

By

Published : Feb 7, 2019, 11:24 PM IST

గిరిపుత్రుడి ప్రతిభ
అఖిలభారతస్థాయి పోటీ పరీక్షల్లో తెలుగువిద్యార్థులు సత్తా చాటుతున్నారు. యూపీఎస్సీ ప్రకటించిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఫలితాల్లో ప్రథమ ర్యాంకుతో సహా మొత్తం ఆరు ర్యాంకులను తెలుగువారే కైవసం చేసుకున్నారు. అందులో 76వ ర్యాంకును జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన భూక్యా నరసింహస్వామి సాధించారు.
ములుగు మండలం పత్తిపల్లి చింతకుంట తండాకు చెందిన స్వామిది వ్యవసాయ కుటుంబం. విద్యార్థి దశ నుంచి కష్టించి చదివి హర్టికల్చర్​లో పీహెచ్​డీ చేశారు. 2015 నుంచి న్యూదిల్లీలోని ఇండియన్​ కౌన్సిల్​ ఫర్​ అగ్రికల్చర్​ రీసెర్చ్​లో వ్యవసాయశాస్త్రవేత్తగా ఉన్నారు. ఎప్పటికైనా సివిల్స్ సాధించాలన్నది స్వామి కల. స్వామి తండ్రి గణ్యానాయక్​ మిర్చి రైతు. గతేడాది డెంగీతో చనిపోయాడు. తండ్రి ఆలోచనలే స్ఫూర్తిగా తీసుకుని రేయింబవళ్లు చదివాడు. రెండోసారి సివిల్స్ రాసి అనుకున్నది సాధించాడు. ఎట్టకేలకు తన తండ్రి కల నెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. స్వామి విజయంపై కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details