తెలంగాణ

telangana

ETV Bharat / state

లక్నవరం సరస్సుకు జలకళ... ఆనందంలో రైతులు - పొలం పనులు

వర్షాలు లేక ఇబ్బందులు పడ్డ రైతుల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. జయశంకర్​ భూపాల పల్లి​ జిల్లాలోని లక్నవరం సరస్సు జలకళ సంతరించుకుంది. ఏడు అడుగులు ఉన్న గుండ్లవాగు ప్రాజెక్టు 35 అడుగులకు చేరుకుంది.

లక్నవరం సరస్సుకు జలకళ

By

Published : Aug 9, 2019, 6:03 PM IST

లక్నవరం సరస్సుకు జలకళ
జయశంకర్​ భూపాల పల్లి జిల్లా గోవిందరావుపేట మండలం లక్నవరం సరస్సు నిండుకుండలా మారింది. 7 అడుగుల నుంచి 35 అడుగులకు చేరుకొని గుండ్లవాగు ప్రాజెక్టు జలమయమై.. మత్తడి దూకుతోంది. కొత్తగూడ ఇల్లందు అడవులలో గత పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు లక్నవరం సరస్సు నిండింది. దీనితో రైతుల కళ్లల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. రెండు నెలలు గడిచినా వర్షాలు రాకపోవడం వల్ల కొంత నిరాశ నెలకొందని రైతులు తెలిపారు. దీనితో పంటలు పండుతాయో లేదో అనే ఆందోళన ఉండేదన్నారు. నిరుత్సాహపడిన అన్నదాతలు వర్షాల వల్ల పొలం పనులు ముమ్మరంగా సాగిస్తున్నారని పేర్కొన్నారు. పొలాల్లో పనిచేసేందుకు కూలీల కొరత ఉందని వెల్లడించారు. కూలీల కొరత తప్ప ఇంకా ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు.

ABOUT THE AUTHOR

...view details