జయశంకర్ భూపాలపల్లి జిల్లా లక్ష్మీ (మేడిగడ్డ) బ్యారేజికి భారీగా వరద పోటేత్తుతోంది. బ్యారేజిలో 85 గేట్లకు గానూ... బుధవారం ఉదయం నుంచి 57 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతం నుంచి 3,50,000 క్యూసెక్కుల మేర ప్రవాహం వస్తుండగా 3,24,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. మేడిగడ్డ సామర్థ్యం 16.17 టీఎంసీలకు గానూ 8.17 టీఎంసీలకు చేరింది.
మేడిగడ్డ బ్యారేజీకి వరద ఉద్ధృతి.. దిగువకు నీటి విడుదల - మేడిగడ్డకు జలకళ
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కాళేశ్వరం జలాశయానికి వరద ప్రవాహం క్రమక్రమంగా వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. ప్రాణహిత నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ నుంచి నీటి విడుదల చేస్తున్నారు.
మేడిగడ్డ బ్యారేజీకి వరద ఉద్ధృతి.. దిగువకు నీటి విడుదల
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు నిండుగా ప్రవహిస్తూ... పరవళ్లు తోక్కుతున్నాయి. పుష్కర ఘాట్లను తాకుతూ ప్రవాహం కొనసాగుతోంది. కాళేశ్వరం పుష్కర ఘాట్ వద్ద్ 8.170 మీటర్ల 30 అడుగుల మేర నీటి మట్టం నమోదైంది.