జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పలు మండలాల్లో భారీ వర్షం కురిసింది. భూపాలపల్లి, రేగొండ, చిట్యాల, టేకుమాట్ల, మొగుళ్లపల్లి, గణపురం మండలాల్లో రాత్రి రెండున్నర సమయంలో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం, మొక్కజొన్నలు పూర్తిగా తడిసి ముద్దయ్యాయి.
కుండపోతగా అకాల వర్షం... రైతులకు తీరని నష్టం - rain effect
ఈదురుగాలులు, ఉరుములుమెరుపులతో కుండపోతగా కురిసిన వర్షానికి రైతుల ధాన్యమంతా తడిసిపోయింది. రాత్రి రెండున్నర సమయంలో ఒక్కసారిగా కురిసిన జల్లులో రైతులు ధాన్యం కుప్పలపై పరదాలు కప్పేలోపే తడిసిపోయి... రైతన్నకు తీరని నష్టం మిగిల్చింది.
కుండపోతగా అకాల వర్షం... రైతులకు తీరని నష్టం
అందరు గాడ నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా ఎడతెగని వర్షం కురిసేసరికి... రైతులు ధాన్యంపై పరదాలు కప్పేలోపే అంతా తడిసిపోయింది. ఇన్ని రోజులు కాపాడుకుంటూ వస్తున్న ధాన్యం... అకాల వర్షంతో నీటిపాలైందని రైతులు తల్లడిల్లిపోతున్నారు.