జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో కాటారం మండలం వీరాపూర్ సమీపంలోని శివశంకర్ ప్రాజెక్టు కట్టకు గండి పడింది. సమీపంలోని ఆయకట్టు పొలాలు నీట మునిగిపోయాయని... రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
శివశంకర్ ప్రాజెక్ట్ కట్టుకు గండి... భారీ వర్షాలే కారణం
ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు కాటారం మండలంలోని వీరాపూర్ సమీపంలోని శివశంకర్ ప్రాజెక్టుకు గండి పడింది. పంటలు మునిగిపోయాయని రైతులు వాపోతున్నారు. వాగులు పొంగి పొర్లుతుండడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.
శివశంకర్ ప్రాజెక్ట్ కట్టుకు గండి... భారీ వర్షాలే కారణం
మహా ముత్తారం మండలంలో కురిసిన అతి భారీ వర్షం వర్షం కారణంగా... వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి.