జయశంకర్ భూపాలపల్లి జిల్లా,భూపాలపల్లిలో ఇవాళ హరితహరం కార్యక్రమం నిర్వహించారు. భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎదురుగా 363 జాతీయ రహదారిపై రాజ్యసభ సభ్యులు బండ ప్రకాశ్, ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ శ్రీ హర్షిణి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డితో పాటు అధికారులు మొక్కలు నాటారు. మానవాళి మనుగడకు చెట్ల పెంపకం అవసరమన్నారు ఎంపీ బండ ప్రకాశ్. కాలుష్య కోరల నుండి తెలంగాణ ప్రజలను కాపాడాలంటే హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
భూపాలపల్లిలో హరితహారం కార్యక్రమం - undefined
భూపాలపల్లిలో నేడు హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీ బండ ప్రకాశ్, ఎమ్మెల్యే గండ్ర, జడ్పీ చైర్‌పర్సన్ శ్రీహర్షణి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి హాజరై మొక్కలు నాటారు.
భూపాలపల్లిలో హరితహారం కార్యక్రమం
హరితహరం కార్యక్రమంలో ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ఒక ఉద్యమంలాగ చెట్లు నాటాలని బండ ప్రకాశ్ అన్నారు. అనంతరం భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని జంగేడు గ్రామం నుండి వేశాలపల్లిలో రూ.2 కోట్ల 78 లక్షలతో నిర్మించనున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, రోడ్డు, కమ్యూనిటీ హాల్, డ్రైనేజీల నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు.
ఇవీ చూడండి: వరదల ధాటికి క్షణాల్లో భవనం నేలమట్టం!