తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎక్సైజ్​ సిబ్బందిపై గుడుంబా తయారీదారుల దాడి - ఎక్సైజ్​ అధికారులపై గుడుంబా తయారీదారుల దాడి

గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహిస్తున్న అధికారులపై... గ్రామస్థులు దాడి చేసిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా అడ్వాలపల్లిలో చోటుచేసుకుంది. గ్రామంలోని ఓ ఇంట్లో సోదాలు చేయడానికి వెళ్లిన అధికారులను దుర్బాషలాడుతూ... దాడి చేశారు.

Gudumba manufacturers attack on excise staff
ఎక్సైజ్​ సిబ్బందిపై గుడుంబా తయారీదారులు దాడి

By

Published : May 20, 2020, 8:28 PM IST

గుడుంబా స్థావరాలపై దాడులు చేస్తున్న అధికారులపై స్థానికులు దాడి చేసిన ఘటన జయశంకర్​ భూపాలపల్లి జిల్లా మల్హర్​ మండలం అడ్వాలపల్లిలో జరిగింది. జిల్లాను గుడుంబా రహితంగా తీర్చిదిదేందుకు రెవెన్యూ, పోలీస్, ఎక్సైజ్ శాఖలు సంయుక్తంగా గుడుంబా స్థావరాలపై దాడులు చేయాలని కలెక్టర్​ ఆదేశించారు. దీనిలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై "రియల్ చెక్ "కార్యక్రమాన్ని రూపొందించారు.

ఈ నేపథ్యంలో అడ్వాలపల్లిలో గుడుంబా తయారు చేస్తున్నారన్న సమాచారంతో మల్హర్​ తహసీల్దారు శ్రీరాముల శ్రీనివాస్​, కాటారం ఎక్సైజ్​ సీఐ మాటేటి ప్రశాంతి... సిబ్బందితో కలిసి సోదాలు చేయడానికి వెళ్లారు. గ్రామంలోని ఓ ఇంట్లో గుడుంబా నిల్వ ఉందనే అనుమానంతో ఇంటి తాళం తెరుస్తుండగా గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు దుర్భాషలాడుతూ తమపై భౌతికంగా దాడి చేసి... సెల్​ఫోన్లు లాక్కొన్నారని ఎక్సైజ్​, రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎక్సైజ్​ సిబ్బందిపై గుడుంబా తయారీదారులు దాడి

ఇదీ చూడండి:పెట్రోల్​ బంక్​ వద్ద ఘర్షణ.. సీసీ కెమెరాల్లో రికార్డు

ABOUT THE AUTHOR

...view details