జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం చెంచుపల్లి గ్రామస్థులు అమరవీరులకు వినూత్న రీతిలో నివాళి అర్పించారు. భరతమాత ఒడిలో ఒదిగిపోయిన సైనికుల జ్ఞాపకంగా 120 మొక్కలు నాటారు. వాటికి అమర జవాన్ల పేర్లు పెట్టి ప్రేమను చాటుకున్నారు.
ఘటన జరిగినప్పుడు నివాళులర్పించి ఆ తర్వాత మర్చిపోకుండా... వాళ్ల త్యాగాలను రోజూ స్మరించుకునేలా మొక్కలు నాటడమనేది మంచి ఆలోచనంటూ.. పలువురు ప్రశసింస్తున్నారు.