జయశంకర్ భూపాలపల్లి కలెక్టరేట్ ఆవరణలో 74 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా మండలి విప్ భాను ప్రసాద్ రావు... జాతీయ జెండా ఎగురవేసి, పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ నాయకత్వంలో సుభిక్షంగా ముందుకు పోతుందని భానుప్రసాద్ రావు అన్నారు.
'సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ ఆదర్శం' - భూపాలపల్లి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రభుత్వ విప్ భాను ప్రసాద్ రావు
జయశంకర్ భూపాలపల్లి కలెక్టరేట్లో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో... ప్రభుత్వ విప్ భానుప్రసాద్ రావు జాతీయ జెండా ఆవిష్కరించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం సుభింక్షంగా ఉందన్నారు.

స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ భానుప్రసాద్ రావు
సాగునీరు, తాగునీరు, ప్రాజెక్టుల నిర్మాణాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అబ్దుల్ అజీం, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి, జెడ్పీ ఛైర్మన్ జక్కు శ్రీహర్షిణి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.