'నీ పేరు లక్ష్మీనరసింహస్వామి... నా పేరు శారదాదేవి'.. కాళేశ్వరం ప్యాకేజీలు - government has named the packages in the Kaleswaram project
12:45 July 29
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో ప్యాకేజీలకు దైవాల పేర్లు
కాళేశ్వరం ప్రాజెక్ట్ 27, 28 ప్యాకేజీలకు రాష్ట్ర ప్రభుత్వం నామకరణం చేసింది. 27వ ప్యాకేజీకి లక్ష్మీనరసింహస్వామి ఎత్తిపోతల పథకంగా పేరు ఖరారు చేసింది. 28వ ప్యాకేజీకి శారదాదేవి ఎత్తిపోతల పథకంగా పిలవాలని నిర్ణయించింది.
లక్ష్మీనరసింహస్వామి పథకం ద్వారా దిలావర్‌పూర్ ప్రాంతానికి సాగునీరు అందనుంది. ఎస్సారెస్పీ ద్వారా దిలావర్‌పూర్‌లో 50 వేల ఎకరాలకు సాగునీరు లభించనుంది. శారదాదేవి పథకం ద్వారా హంగార్గ ప్రాంతానికి సాగునీరు సమకూరుతుంది. ఎస్సారెస్పీ ద్వారానే హంగార్గలోనూ 50 వేల ఎకరాలకు సాగునీరు అందనుందని నీటిపారుదల శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.