జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఉద్యోగులు సంబురాలు చేసుకుంటున్నారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. 30 శాతం ఫిట్మెంట్ అమలు చేయడంపై ధన్యవాదాలు తెలిపారు.
KCR Palabhishekam: భూపాలపల్లిలో ప్రభుత్వ ఉద్యోగుల సంబురాలు - ముఖ్యమంత్రి కేసీఆర్ తాజా వార్తలు
30 శాతం ఫిట్మెంట్ ఇవ్వడంపై ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ... సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలతో అభిషేకం చేస్తున్నారు. భూపాలపల్లి జిల్లాలో సంబురాలు చేసుకున్నారు.
భూపాలపల్లిలో ప్రభుత్వ ఉద్యోగుల సంబురాలు
ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి భూపాలపల్లి నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని ప్రభుత్వ ఉద్యోగులు కొనియాడారు. టీచర్లు, పాఠశాల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారని అన్నారు. ఈ కార్యక్రమానికి తెరాస జిల్లా నాయకులు బుర్ర రమేష్ సహా పలువురు ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు హాజరయ్యారు.
ఇదీ చూడండి:MURDER: చెల్లితో అసభ్య ప్రవర్తన.. రోకలిబండతో చంపిన సోదరి