GODAVARI FLOOD LEVEL: కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గింది. తెలంగాణ, మహారాష్ట్రలో భారీ వర్షాలు, ప్రాజెక్టుల నీటి విడుదలతో కాళేశ్వరం ప్రాజెక్ట్కు రికార్డు స్థాయిలో వరద ఉధృతి కొనసాగుతున్నప్పటికీ వర్షం విరామం ఇవ్వడంతో కొంత మేర ఊరటనిచ్చింది. మేడిగడ్డ పంప్ హౌస్ వరద నీటిలోనే ఉండిపోయింది. మేడిగడ్డ బ్యారేజీకి 28 లక్షల 67వేల 650 క్యూసెక్కుల భారీ వరద నుంచి 10లక్షల 45వేల 520 క్యూసెక్కులకు వరద ప్రవాహం తగ్గింది. మేడిగడ్డలో 85 గేట్లుకు గాను 85 గేట్లు ఎత్తి దిగువకు నీటికి విడుదల చేస్తున్నారు. అన్నారం బ్యారేజీలో 66 గేట్లకు గాను 66 గేట్లు తెరిచారు. అన్నారం బ్యారేజికి ఇన్ ఫ్లో 38వేల 604 క్యూసెక్కులు ఉండగా అదే స్థాయిలో నీటికి కిందికి వదులుతున్నారు.
శాంతిస్తున్న గోదావరి.. కాళేశ్వరం వద్ద తగ్గిన వరద ప్రవాహం - floods update
GODAVARI FLOOD LEVEL: వారం రోజులుగా మహోగ్రంగా ప్రవహిస్తున్న గోదావరి కాస్త శాంతించినట్లు కనిపిస్తోంది. ఎగువనుంచి ప్రవాహం కాస్త తగ్గినట్లు అధికారులు తెలిపారు. మేడగడ్డ వద్ద కాళేశ్వరం ప్రవాహం నిన్నటి కంటే తక్కువగా నమోదైంది.
GODAVARI
కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద వరద తగ్గింది. కాళేశ్వరం పుష్కర ఘాట్ల పైనుంచి గోదావరి, ప్రాణహిత నదుల ప్రవాహం కొనసాగుతోంది. తెలంగాణ-మహారాష్ట్ర వంతెన మీదుగా రాకపోకలు నిలిచాయి. పలిమెల మండలం జలదిగ్బంధంలో ఉంది. విద్యుత్, వైద్యం, రవాణా, తాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.