జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద జలకళ సంతరించుకుంది. గోదావరి, ప్రాణహిత నదులు పుష్కర ఘాట్‌ను తాకుతూ ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి(Godavari and Pranahita rivers flowing as excerpts). విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి భారీ వరద నీరు వస్తుంది.
పుష్కర ఘాట్లపై ఉన్న దుకాణాల్లోకి వరద నీరు చేరింది. త్రివేణి సంగమం వద్ద 12.600 మీటర్ల మేర ప్రవాహం కొనసాగుతోంది. ప్రవాహం ఉద్ధృతంగా ఉండడం వల్ల గోదావరి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. నదిలో పూజా కార్యక్రమాలకు, స్నానాలకు దిగేందుకు ఎవరినీ అనుమతించడం లేదు.