జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. మహారాష్ట్రలో కురుస్తోన్న వర్షాలతో ప్రాణహిత నది పరవళ్లు తొక్కుతోంది. గోదావరి, ప్రాణహిత నదులు నిండుగా ప్రవహిస్తుండడం వల్ల కాళేశ్వరం పుష్కర ఘాట్ మెట్లు నీట మునిగాయి.
త్రివేణి సంగమం ఘాట్ వద్ద 12.270 మీటర్ల మేర నీరు ప్రవహిస్తోంది. మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి ఉభయ నదులు ప్రవహిస్తున్నాయి. కాళేశ్వరంలో.. పూజలు, భక్తుల పుణ్యస్నానాలు నిలిపివేశారు. తీర ప్రాంతానికి ఎవరిని రానివ్వకుండా పోలీసులు ఆంక్షలు విధించారు.