తెలంగాణ

telangana

ETV Bharat / state

Nominated MLC madhusudhana chary: నామినేటెడ్ ఎమ్మెల్సీగా మధుసూదనాచారి.. గెజిట్ జారీ - ts Gazette notification

Nominated MLC
నామినేటెడ్ ఎమ్మెల్సీగా మధుసూదనాచారి

By

Published : Dec 14, 2021, 10:30 AM IST

Updated : Dec 14, 2021, 11:24 AM IST

10:28 December 14

నామినేటెడ్ ఎమ్మెల్సీగా మధుసూదనాచారి

Nominated MLC madhusudhana chary: గవర్నర్ కోటాలో నామినేటెడ్ ఎమ్మెల్సీగా మాజీ సభాపతి మధుసూదనాచారి నియమితులయ్యారు. మధుసూదనాచారిని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్​ను విడుదల చేసింది. గవర్నర్ కోటా నామినేటెడ్ ఎమ్మెల్సీగా ఆయన పెద్దల సభకు ప్రాతినిధ్యం వహించనున్నారు.

గతంలో ఈ కోటా నుంచి ఎమ్మెల్సీగా ఉన్న మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి పదవీకాలం జూన్ 16తో ముగిసింది. ఆయన స్థానంలో మధుసూధనాచారిని ప్రతిపాదిస్తూ రాష్ట్ర మంత్రివర్గం చేసిన సిఫారసును గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదించారు. మధుసూధనాచారిని మండలికి నామినేట్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇవాళ్టి నుంచి మధుసూధనాచారి పదవీకాలం ప్రారంభం కానుంది. ఈ మేరకు సాధారణ పరిపాలనాశాఖ ఉత్తర్వులు వెలువరించింది.

మొదట పాడి కౌశిక్ రెడ్డి పేరును రాష్ట్ర మంత్రివర్గం పెద్దలసభకు సిఫారసు చేసింది. అయితే గవర్నర్ తమిళిసై సాందరరాజన్ కౌశిక్ పేరును ఆమోదించలేదు. సామాజిక సేవ కేటగిరీలో వచ్చిన కౌశిక్ రెడ్డి ప్రతిపాదనను ఇంకా అధ్యయనం చేయాల్సి ఉంటుందని... కొంత సమయం పడుతుందని అప్పట్లో మీడియాకు గవర్నర్ తమిళిసై తెలిపారు. తదుపరి పరిణామాల్లో కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యేల కోటాలో పెద్దలసభకు పంపి... ఆయన స్థానంలో మధుసూధనాచారి పేరును మంత్రివర్గం సిఫారసు చేసింది.

మధుసూదనాచారి ప్రస్థానం

madhusudhana chary profile: 1982లో తెలుగుదేశం పార్టీలో చేరిన మధుసూధనాచారి... 1994-99 మధ్య కాలంలో శాయంపేట నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. మళిదశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంట మొదటి నుంచి ఉన్న ఆయన... తెరాస వ్యవస్థపక సభ్యుల్లో ఒకరు. 2014 ఎన్నికల్లో భూపాలపల్లి నుంచి తెరాస శాసనసభ్యునిగా ఎన్నికైన ఆయన... నూతన తెలంగాణ రాష్ట్రం మొదటి శాసనసభాపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2018 ఎన్నికల్లో తిరిగి భూపాలపల్లి నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం పరిణామాల్లో గండ్ర కూడా తెరాస శాసనసభాపక్షంలో విలీనమయ్యారు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో మధుసూధనాచారి పెద్దలసభకు నామినేట్ అయ్యారు.

శాసన మండలి సభ్యుడిగా కేసీఆర్ అవకాశం

పార్టీలో తన పరిస్థితి ఏంటో అర్థంగాక అగమ్యగోచర స్థితిలో ఉన్న మధుసూదనాచారికి తెలంగాణ సీఎం కేసీఆర్.. శాసన మండలి సభ్యుడిగా అవకాశం కల్పిస్తారనే ఊహాగానాలు తెరలేచాయి. ఆయనకు శాసన మండలి ఛైర్మన్​గా అవకాశం ఇస్తే బాగుంటుందని పార్టీ శ్రేణులు కూడా అభిప్రాయపడటంతో ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

Last Updated : Dec 14, 2021, 11:24 AM IST

ABOUT THE AUTHOR

...view details