తెలంగాణ

telangana

ETV Bharat / state

లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో... గండ్ర దంపతులు - ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి వార్తలు

సుప్రసిద్ధ కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామిని గండ్ర దంపతులు దర్శించుకున్నారు. అమ్మవారికి బంగారు తాళిబొట్టును సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ నెల 12న భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహిస్తున్న గోదా దేవి కళ్యాణ మహోత్సవంలో ప్రజలందరూ పాల్గొనాలని గండ్ర కోరారు.

gandra-visited-kodavatancha-temple-in-jayashanker bhupalpally
లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో... గండ్ర దంపతులు

By

Published : Jan 8, 2021, 6:34 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని కొడవటంచ గ్రామంలోని సుప్రసిద్ధ లక్ష్మీ నరసింహస్వామిని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి, సతీమణి గండ్ర జ్యోతి దర్శించుకున్నారు. అభిషేక కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి బంగారు తాళిబొట్టును గండ్ర దంపతులు సమర్పించారు.

దేవాలయ నూతన పాలక వర్గ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమంతోపాటు.. భూలక్ష్మీ దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నియోజకవర్గ ప్రజల క్షేమం కోసం ఈ నెల 12న భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహిస్తున్న గోదా దేవి కళ్యాణ మహోత్సవంలో ప్రజలందరూ పాల్గొనాలని గండ్ర కోరారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా పరిషత్​ వైస్ ఛైర్​పర్సన్, భూపాలపల్లి మున్సిపల్ ఛైర్​పర్సన్, గ్రామ సర్పంచ్​లు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:'సాగు చట్టాలు రద్దు చేస్తేనే ఇంటికి..'

ABOUT THE AUTHOR

...view details