తెలంగాణ

telangana

ETV Bharat / state

కాంగ్రెస్​కు గండ్ర షాక్... త్వరలో తెరాసలోకి - trs

కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి రాజీనామా చేశారు. తెరాసలో చేరుతున్నట్లు ప్రకటించారు. గండ్ర దంపతులు కేటీఆర్​ను కలిశారు.

gandra

By

Published : Apr 22, 2019, 10:53 PM IST

Updated : Apr 23, 2019, 1:13 AM IST

తెలంగాణ కాంగ్రెస్​కు మరో షాక్ తగిలింది. హస్తం పార్టీకి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి రాజీనామా చేశారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను గండ్ర దంపతులు కలిశారు. నియోజకవర్గ ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చేందుకే పార్టీని వీడుతున్నట్లు గండ్ర తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని... రాష్ట్ర అభివృద్ధి తెరాసతోనే సాధ్యమని రాజీనామా లేఖలో గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. అవసరమైతే కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చిన పదవులన్నింటికి రాజీనామా చేయడానికి సిద్ధమని ప్రకటించారు. త్వరలోనే తెరాసలో చేరుతానని స్పష్టం చేశారు. ఆయన సతీమణి గండ్ర జ్యోతి కూడా డీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

తెరాసలోకి గండ్ర వెంకటరమణారెడ్డి

ఇదీ చూడండి:భూతాధిపతి బేతాళుడికి ఇక్కడ జాతర చేస్తారు

Last Updated : Apr 23, 2019, 1:13 AM IST

ABOUT THE AUTHOR

...view details