జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రంగయ్యపల్లి జడ్పీఎస్ పాఠశాల విద్యార్థులు తమ స్నేహాన్ని చాటుకున్నారు. పదో తరగతి 2004-2005 బ్యాచ్ విద్యార్థులైన అరుణ్, సతీశ్, రజినీకాంత్, రాజినీకర్, కృష్ణమూర్తి, పరమేశ్, శ్రీమాన్, రాజు, సాగర్ తదితరులు.. తమ బాల్య స్నేహితుడి జ్ఞాపకార్థం గ్రామంలో కూర్చోడానికి బెంచీలను ఏర్పాటు చేశారు.
చావుతో దూరమైనా.. జ్ఞాపకాలతో దగ్గరగా ఉండాలని! - jayashankar bhupalapalli district news
చావుతో బాల్య స్నేహితుడు దూరమైనా.. అతని జ్ఞాపకాలు చెరిగిపోకుడదనుకున్నారు ఓ పాఠశాల పూర్వ విద్యార్థులు. అంతా కలిసి ఓ నిర్ణయానికి వచ్చారు. తమకు తోచినంతా డబ్బులు వేసుకొని గ్రామ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేపట్టారు. స్నేహితుడు రంజిత్ పేరుతో బెంచీలు ఏర్పాటు చేశారు.
చావుతో దూరమైనా.. జ్ఞాపకాలతో దగ్గరగా ఉండాలని!
తమతో చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్న తోట రంజిత్ అనారోగ్యంతో అకస్మాత్తుగా చనిపోయాడు. రంజిత్ మరణంతో తమకు దూరమైనా.. అతని గుర్తులు చెరిగిపోకుడదనుకున్నారు. స్నేహితుడి పేరుతో గ్రామంలో బెంచీలు ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. తమకు తోచినంతగా డబ్బులు వేసుకుని బెంచీలు ఏర్పాటు చేశారు.
ఇవీ చూడండి:ట్విట్టర్ ట్రెండింగ్లో హ్యాపీ బర్త్డే కేసీఆర్