మేడారం జాతర పరిసర ప్రాంతాల్లో వైఫై హాట్‌స్పాట్ ఈసారి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. గతంలో 10 ప్రధాన కూడళ్లలో 20 వైఫై రూటర్లు మాత్రమే పెట్టి భక్తులకు ఇంటర్నెట్ అందించారు. ఈసారి 20 ప్రధాన కూడళ్లలో 80 రూటర్లతో వైఫై సేవలు అందించనున్నారు. ఒక్కో రూటర్ నుంచి దాదాపు 300 మీటర్ల వరకు సిగ్నల్స్ అందుతాయి. 10 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ సేవలను సమకూర్చేందుకు అత్యాధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించనుంది బీఎస్ఎన్ఎల్.
రోజుకు 1 జీబీ డేటా ఉచితం
ఒక్క మొబైల్ లాగిన్‌తో రోజుకు 1 జీబీ డేటా ఉచితంగా వినియోగించుకోవచ్చు. బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ వినియోగదారులు మాత్రం రోజుకు 2 జీబీ డేటాను వాడుకోవచ్చు. ఈ సేవల ద్వారా జాతరకు సంబంధించిన ప్రతి సమాచారం క్షణాల్లో ప్రపంచానికి తెలిసిపోతుంది. రద్దీ విషయంలో కూడా ఎప్పటికప్పుడు వేగంగా సమాచారం అందుతుంది. ట్రాఫిక్ నియంత్రించి రద్దీ లేకుండా చూసుకునే వీలుంటుంది. జాతర పరిసరాల్లో టవర్ల నిర్మాణం, వైఫై రూటర్ల ఏర్పాట్ల కోసం 40మంది బీఎస్ఎన్ఎల్ సిబ్బంది పనిచేస్తున్నారు. క్వార్డ్‌జెన్ సంస్థ కూడా ఈ ఏర్పాట్లలో పాలు పంచుకుటుంది.
మెరుగైన సేవల కోసం
భక్తుల సౌకర్యార్థం జాతరలో తాత్కాలికంగా 16 టవర్లు ఏర్పాటు చేశారు. గతంలో నెట్వర్క్ సిగ్నల్స్ లేకపోవడం వల్ల సమాచార లోపంతో భక్తులు చాలా ఇబ్బంది పడ్డారు. దీనికి తోడు.. ఈసారి జాతరలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని ఊహించిన అధికారులు భక్తులు తప్పిపోకుండా.. ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులతో సమాచారం చేరవేసేందుకు వీలుగా.. తాత్కాలిక సిగ్నల్ టవర్లను, వైఫై కేంద్రాలను అందుబాటులో ఉంచనున్నారు. భక్తులకు 24 గంటలపాటు 2జీ, 3జీ, 4జీ సేవలు ఉంటాయి.