తెలంగాణ

telangana

ETV Bharat / state

భూపాలపల్లిలో నాలుగు నామినేషన్ల దాఖలు - four nominations in bhupalapally muncipality

హైకోర్టులో దాఖలైన అభ్యంతరాలతో... భూపాలపల్లి మున్సిపల్​ ఎన్నికకు నోటిఫికేషన్​ విడుదల ఆలస్యమైంది. కోర్టు ఆదేశాలతో నోటిఫికేషన్​ జారీ చేసి.. బుధవారం ఉదయం నుంచి నామపత్రాలు స్వీకరిస్తున్నారు. మొదటి రోజు 4 నామినేషన్లు దాఖలయ్యాయి.

భూపాలపల్లిలో నాలుగు నామినేషన్ల దాఖలు
భూపాలపల్లిలో నాలుగు నామినేషన్ల దాఖలు

By

Published : Jan 8, 2020, 11:26 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీలో 4 నామినేషన్లు దాఖలయ్యాయి. షెడ్యూల్​ ప్రకారం మంగళవారం ఉదయం నోటిఫికేషన్​ విడుదల కావాల్సి ఉన్నా... దీనిపై అభ్యంతరాలు రావడంతో ఆలస్యమైంది. హైకోర్టు గ్రీన్​ సిగ్నల్​తో... ఉత్కంఠ వీడింది.

పట్టణంలో 30 వార్డులు ఉండగా... మూడింటికి ఒకటి చొప్పున 10 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో ఆర్వో సహాయకుడిని, ఆరుగురు సిబ్బందిని నియమించారు. అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేయడానికి హెల్ప్​లైన్​ డెస్క్​ కూడా ఏర్పాటు చేసినట్లు కమిషనర్ సమ్మయ్య తెలిపారు. 144 సెక్షన్ అమలు చేసి... అభ్యర్థితో పాటు ఇద్దరిని మాత్రమే లోపలికి అనుమతించారు..

భూపాలపల్లిలో నాలుగు నామినేషన్ల దాఖలు

ఇవీ చూడండి: మున్సిపాలిటీగా అవతరించిన నందికొండ కథేంటీ...!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details