తెలంగాణ

telangana

ETV Bharat / state

గిరిజనులకు నిత్యావసరాలు అందజేసిన ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ - groceries to needy in bhupalpally by forward block party

లాక్​డౌన్​లో ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న పేదలకు తోచినంత సాయం చేయాలని ఆల్​ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్​ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణ రావు కోరారు. జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలోని గిరిజన ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.

forward block party distributed groceries to needy in bhupalpally
గిరిజనులకు నిత్యావసరాలు అందజేసిన ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ

By

Published : May 12, 2020, 2:13 PM IST

జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలోని పందిపంపుల, కుందురుపల్లి గ్రామాల్లోని గుత్తికోయల కుటుంబాలకు ఆల్​ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర నాయకుడు గండ్ర సత్యనారాయణరావు నిత్యావసరాలు అందజేశారు. పేదప్రజలను ఆదుకోవడానికి ఎల్లప్పుడు అందుబాటులో ఉంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాంనేనీ రవీందర్, అంబాల శ్రీను, సర్పంచ్ మధువంశీ, మాజీ సర్పంచ్ తోట సంతోష్, కౌన్సిలర్ దాట్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.

ప్రజలంతా లాక్​డౌన్​ నిబంధనలు పాటిస్తూ కరోనా బారిన పడకుండా జాగ్రత్త వహించాలని సత్యనారాయణ కోరారు. ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details