తెలంగాణ

telangana

ETV Bharat / state

'తరుగు పేరుతో కోత విధిస్తున్నారు... ఛైర్మన్​ రాజీనామ చేయాలి' - తాడిచర్లలో రైతులు ఆందోళన వార్తలు

వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో లారీలోడు ధాన్యానికి తరుగు పేరుతో వంద బస్తాల ధాన్యం కోత విధించారంటూ రైతులు ఆందోళనకు దిగిన ఘటన మల్హర్ మండంలోని తాడిచర్లలో చోటు చేసుకుంది. అధికారులు ఈ విషయంపై దర్యాప్తు చేసి... తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

formers-protest-at-malhar-mandal-jayashankar-bhupalapalli-district
'తరుగు పేరుతో కోత విధిస్తున్నారు... ఛైర్మన్​ రాజీనామ చేయాలి'

By

Published : Oct 13, 2020, 11:35 AM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచర్లలో రైతులు ఆందోళనకు దిగారు. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి... కష్టపడి పండించిన వరి ధాన్యానికి.. ప్రభుత్వ మద్ధతు ధర వస్తుందని ఆశపడి తాడిచర్ల వ్యవసాయ సహకార సంఘం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు అమ్మేందుకు వెళ్లారు. కానీ అక్కడ కోత పేరుతో కొనుగోలు కేంద్రం నిర్వహకులు, పీఎసీఎస్ సిబ్బంది, రైస్ మిల్లర్లు కుమ్మక్కై ఒక లారీ లోడు ధాన్యానికి... తరుగు పేరుతో వంద బస్తాల ధాన్యం కోత విధించారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిబ్బందిపై దాడి చేసే ప్రయత్నం చేశారు.

'తరుగు పేరుతో కోత విధిస్తున్నారు... ఛైర్మన్​ రాజీనామ చేయాలి'

అనంతరం సిబ్బందిని కార్యాలయంలో బంధించి... బయట రైతులు బైఠాయించి ఛైర్మన్ వెంటనే రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. ఈ నెల 5వ తేదీన అధికారులు, ఛైర్మన్ సొమ్ము చెల్లించని రైతులకు సొమ్ము చెల్లించి... ధాన్యం కోత విధించిన రైతులకు న్యాయం చేస్తామని ఎగనామం పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. వంద బస్తాల ధాన్యం అమ్మిన రైతుకు పది నుంచి ముప్పై బస్తాల వరకు కోత విధించి... ట్రక్​షీట్​లో బినామీలా పేర్లు రాసుకుని రైతుల సొమ్ము భారీగా స్వాహా చేశారని మండిపడ్డారు. దీనిపై పూర్తి విచారణ జరిపి రైతులకు న్యాయం చేస్తామని భూపాలపల్లి డీసీఓ ఇచ్చిన ఆదేశాల మేరకు రైతులు శాంతించారు.

ఇదీ చూడండి:సేద్య చట్టం... కార్పొరేట్‌ చుట్టం!.. వ్యవసాయ చట్టాలపై హరీశ్​రావు మనోగతం

ABOUT THE AUTHOR

...view details