తెలంగాణ

telangana

ETV Bharat / state

వృద్ధుడిపై అటవీ అధికారి దాడి - OLD MAN

చనిపోయిన వ్యక్తికి దహనసంస్కారాల కోసం కట్టెలు తీసుకురాబోయాడు ఓ వృద్ధుడు. అది చూసిన ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ మానవత్వం మరిచి గొడ్డలికర్రతో చితకబాదాడు. ఈ ఘటన ములుగు జిల్లా చల్వాయి గ్రామంలో చోటుచేసుకుంది.

వృద్ధుడిపై అటవీ అధికారి దాడి

By

Published : Feb 24, 2019, 8:11 PM IST

వృద్ధుడిపై అటవీ అధికారి దాడి
ములుగు జిల్లా గోవిందరావుపేట చల్వాయి గ్రామానికి చెందిన ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ జన్నారపు రాజు కుమార్‌ అనారోగ్యం కారణంగా నిన్న రాత్రి మృతి చెందాడు. దహన సంస్కారాల కోసం ఓ వృద్ధుడు అడవి నుంచి కట్టెలు తీసుకురాబోయాడు. అది గమనించిన అటవీశాఖ అధికారి.. ఎందుకు తెచ్చావంటూ తిట్టడం మొదలు పెట్టాడు. దహనసంస్కారాల కోసమని చెప్పినా... వినిపించుకోకుండా గోడ్డలి కర్రతో కొట్టాడని వృద్ధుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తెచ్చిన కర్రలను చిందరవందర చేసి వెళ్లిపోయాడని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details