జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో తొలి ఏకాదశిని పురస్కరించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. తెల్లవారుజాము నుంచే సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో కాళేశ్వరం చేరుకున్నారు.
కాళేశ్వరం ఆలయంలో తొలి ఏకాదశి వేడుకలు - కాళేశ్వరంలో భౌతిక దూరం పాటిస్తూ తొలి ఏకాదశి 2020 వేడుకలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. తెల్లవారు జాము నుంచే సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామిని దర్శించుకున్నారు.
![కాళేశ్వరం ఆలయంలో తొలి ఏకాదశి వేడుకలు first tholi ekadasi 2020 celebrations at kaleswaram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7844879-94-7844879-1593592467885.jpg)
కాళేశ్వరం ఆలయంలో తొలి ఏకాదశి వేడుకలు
కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి, గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివసత్తుల పూనకాలతో గోదావరి తీరం సందడిగా మారింది. అనంతరం భక్తులు భౌతిక దూరం పాటిస్తూ శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో స్వామి వారిని దర్శించుకున్నారు.
TAGGED:
కాళేశ్వరంలో శయన ఏకాదశి