తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆవును కాపాడబోయి తండ్రీకొడుకులు మృతి - ఆవును కాపాడబోయి తండ్రీకొడుకుల మృతి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా పర్లపల్లి గ్రామంలో విషాధం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయిన ఆవను కాపాడబోయి తండ్రీకొడుకులు కూడా మృతి చెందారు.

father and son died at jayashanker bhupalapalli
ఆవును కాపాడబోయి తండ్రీకొడుకుల మృతి

By

Published : Aug 9, 2020, 12:08 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పర్లపల్లి గ్రామానికి చెందిన పుల్యాల ఓదెలు, అతని కుమారుడు మధుకర్​లు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ రోజు ఉదయం ఆవును మేపేందుకు చేనుకు తీసుకెళ్తుండగా... ప్రమాదవశాత్తు ఆవు చెరువులో పడిపోయింది. దానిని కాపాడేందుకు మధుకర్ చెరువులో దిగాడు.

నీటిమట్టం ఎక్కువగా ఉండటం వల్ల మధుకర్ ఊపిరాడక నీటిలో మునుగుతుండటం చూసిన తండ్రి... కొడుకును కాపాడే ప్రయత్నం చేశాడు. ప్రమాదవశాత్తు కొడుకుతో పాటు తండ్రి కూడా నీటిలో మునిగి అక్కడికక్కడే చనిపోయారు. తండ్రీకొడుకుల మృతితో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి:ఆదివారం కరోనా పరీక్షలకు ఆటంకం.. మూడొంతుల కేంద్రాల మూత

ABOUT THE AUTHOR

...view details