జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హార్ మండలం తాడిచర్ల ఐకేపీ కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ధర్నాకు దిగారు. ఖమ్మంపల్లి తాడిచర్ల ప్రధాన రహదారిపై బైఠాయించి.. నిరసన వ్యక్తం చేశారు.
తడిచిన ధాన్యాన్ని కొనాలంటూ రైతుల ధర్నా - తాడిచర్లలో రైతుల ధర్నా వార్తలు
అకాల వర్షాలకు తడిసిన తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రైతులు ధర్నాకు దిగిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడిచర్లలో చోటుచేసుకుంది.
![తడిచిన ధాన్యాన్ని కొనాలంటూ రైతుల ధర్నా Farmers strike at thadicharla ikp centre](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7432005-679-7432005-1591009489638.jpg)
తడిచిన ధాన్యాన్ని కొనాలంటూ రైతుల ధర్నా
జిల్లాలోని కాటారం, మహాదేవపూర్, మహాముత్తారం, మల్హార్ మండలాల్లో కురిసిన భారీ వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. ఫలితంగా ధాన్యం కొనుగోళ్లలో అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తాము నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తడిచిన ధాన్యాన్నీ కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని కోరారు.
ఇదీచూడండి: నిషేధిత గడ్డిమందు, నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత