పెట్టుబడి సాయంగా అందించే రైతు బంధు డబ్బులు ఖాతాల్లో జమకానుండటంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రంగయ్యపల్లి గ్రామంలో ఎంపీపీ పుణ్ణం లక్ష్మీ రవి ఆధ్వర్యంలో రైతులు... సీఎం కేసీఆర్, స్థానిక ఎమ్మెల్యే దంపతులు గండ్ర వెంకటరమణ రెడ్డి, జ్యోతి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
సీమాంధ్ర పాలనలో రైతులను పట్టించుకున్న నాథుడే లేడని ఎంపీపీ పుణ్ణం లక్ష్మీ రవి అన్నారు. రైతులను ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం తెరాస ప్రభుత్వమని కొనియాడారు. రైతుకు ఉచిత కరెంట్, రైతుబీమా, నాణ్యమైన విత్తనాలతో అనేక పథకాలు ప్రవేశపెట్టి... ఆదుకుంటోందని తెలిపారు