జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పలు గ్రామాల్లో మాజీ శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి పర్యటించారు. టేకుమట్ల మండలంలోని వివిధ గ్రామాల్లో ఇటీవల మరణించిన మృతుల కుటుంబీకులతో మాట్లాడారు. వారి మరణాలకు కారణాలు తెలుసుకొని కుటుంబ సభ్యులను ఓదార్చారు. టేకుమట్ల సర్పంచ్ పొలాల సర్వోత్తమ్ రెడ్డి తమ్ముడైన రాంరెడ్డి, ఎంపెడు సర్పంచ్ కొలిపాక రాజయ్య తల్లి, కుందనపల్లి మాజీ సర్పంచ్ అరకొండ రాజయ్య తండ్రి, బండపల్లికి చెందిన స్వప్న, చిట్యాల గ్రామ సర్పంచ్ మాసు రాజయ్య కుటుంబాలను ఆయన పరామర్శించారు. బాదిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో సిరికొండ ప్రశాంత్, టేకుమట్ల జెడ్పీటీసీ పులి తిరుపతి రెడ్డి, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు కత్తి సంపత్ గౌడ్, ప్రధాన కార్యదర్శి ఆకునూరు తిరుపతి, టేకుమట్ల ఎంపీటీసీ ఆది రఘు, పీఏసీఎస్ డైరెక్టర్ దొడ్ల కోటి, పలు గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.
మృతుల కుటుంబాలను పరామర్శించి మాజీ స్పీకర్! - స్పీకర్ పరామర్శ
తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని పలు గ్రామాల్లో తిరిగిన ఆయన ఇటీవల వివిధ కారణాలతో మరణించిన మృతుల కుటుంబాలను పరామర్శించారు. చనిపోయిన వారికి నివాళులు అర్పించి.. కుటుంబీకులకు ధైర్యం చెప్పారు.
మృతుల కుటుంబాలను పరామర్శించి మాజీ స్పీకర్!