తెలంగాణ

telangana

ETV Bharat / state

పోటీ పరీక్షల సన్నద్ధతపై.. ఈనాడు, ఈటీవీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు - వరంగల్ తాజా వార్తలు

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్ ప్రకటించిన సందర్భంగా నిరుద్యోగులు, విద్యావేత్తలతో ఈనాడు, ఈటీవీ చర్చా వేదిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిర్వహించిన సమావేశానికి విశేష స్పందన లభించింది.

eenadu, etv debate
ఈనాడు, ఈటీవి చర్చా వేదిక

By

Published : Mar 14, 2022, 10:48 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తేజశ్విని జూనియర్ కళాశాలలో ఈనాడు, ఈటీవీ తెలంగాణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరుద్యోగుల పోటీ పరీక్షల సన్నద్ధతపై చర్చా వేదికను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయ్ భాస్కర్ పాల్గొన్నారు.

విద్యార్థులు, నిరుద్యోగ యువకులు పట్టుదలతో చదివితేనే ఫలితం వస్తుందని వ్యవసాయ శాఖ అధికారి విజయ్ భాస్కర్ పేర్కొన్నారు. సరైన ఉద్యోగాన్ని ఎంచుకొని చదవాలని అలాచేస్తే తప్పకుండా విజయాన్ని సాధిస్తారని ఆయన తెలిపారు.

ప్రభుత్వం జిల్లాలో, మండలాల్లో ఉచిత కోచింగ్ సెంటర్లు, ఏర్పాటు చేసి సంబంధించిన పుస్తకాలను అందించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఈనాడు, ఈటీవీ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినందుకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ దేవేందర్ రెడ్డి, మూర్తి, సంజీవరావు, విద్యార్థి సంఘ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: రికార్డు ధరకు ఎర్ర బంగారం.. 35 వేలు పలుకుతోన్న దేశీ మిర్చి..

ABOUT THE AUTHOR

...view details