తెలంగాణ

telangana

ETV Bharat / state

థర్మల్ స్క్రీనింగ్ మిషన్లను అందజేసిన ఈసీఐఎల్ - జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాజా వార్తలు

హైదరాబాద్​లోని ఈసీఐఎల్ కంపెనీ ప్రతినిధులు రెండు థర్మల్ స్క్రీనింగ్ మిషన్లను జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్యకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్​ వారికి కృతజ్ఞతలు తెలిపారు.

ECIL provided two thermal screening machines to bhupalpally collector
థర్మల్ స్క్రీనింగ్ మిషన్లను అందజేసిన ఈసీఐఎల్

By

Published : Dec 9, 2020, 4:19 AM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్యకు రెండు థర్మల్ స్క్రీనింగ్ మిషన్లను హైదరాబాద్​లోని ఈసీఐఎల్ కంపెనీ ప్రతినిధులు అందజేశారు. కొవిడ్ వైరస్ బారిన పడిన వారిని సులభంగా గుర్తించుటకు ఈసీఐఎల్ హైదరాబాద్ రూపొందించబడిన మిషన్లను వారు అందించారు. కోరిన వెంటనే అందించినందుకు ఈసీఐఎల్ సంస్థకు కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు.

ఒక మిషన్​ను ములుగు జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేస్తామని.. మరొకటి ఎక్కడ ఏర్పాటు చేయాలనేది త్వరలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఈసీఐఎల్ కంపెనీ పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ హెడ్ ఆసిఫ్ ఉల్లా బేగ్, సీఎస్ఆర్ పర్సనల్ ఆఫీసర్ సునీల్ కుమార్, అడిషనల్ జనరల్ మేనేజర్ మఖాన్ దార్, నీతి అయోగ్ డిస్టిక్ కో ఆర్డినేటర్ రాహుల్, డీపీఆర్ఓ రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి :హత్యకు దారి తీసిన వివాహేతర సంబంధం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details