ఫైళ్ల నిర్వహణ సమర్థంగా చేయడానికి ఈ-ఆఫీస్ పద్ధతి చాలా అనుకూలమైనదని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. ఫైళ్ల మూమెంట్లో ఆలస్యాన్ని నిరోధించడమే కాకుండా.. రూపొందించడంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి స్థాయిలో సంబంధిత సెక్షన్ అధికారులు రిమార్కులు రాయాల్సి ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్క ఉద్యోగి ఈ-ఆఫీస్ పద్ధతిలో ఫైళ్ల మూమెంట్‌పై అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ సూచించారు.
భూపాలపల్లి కలెెక్టరేట్లో ఈ-ఆఫీస్ మేనేజ్మెంట్పై శిక్షణా కార్యక్రమం - bhupalpally district collector
ఈ-ఆఫీస్ మేనేజ్మెంట్పై ప్రతి ఒక్క ఉద్యోగి అవగాహన కలిగి ఉండాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. కలెక్టరేట్లో జరిగిన ఈ-ఆఫీస్ మేనేజ్మెంట్పై శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
![భూపాలపల్లి కలెెక్టరేట్లో ఈ-ఆఫీస్ మేనేజ్మెంట్పై శిక్షణా కార్యక్రమం E-Office Management in Bhupalapalli Collectorate](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9589256-462-9589256-1605764026118.jpg)
భూపాలపల్లి కలెెక్టరేట్లో ఈ-ఆఫీస్ మేనేజ్మెంట్పై శిక్షణా కార్యక్రమం
అనంతరం కలెక్టరేట్లోని వివిధ సెక్షన్లను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచాలని ఏవో మహేశ్‌బాబును కలెక్టర్ ఆదేశించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ స్వర్ణలత, కలెక్టర్ ఆఫీస్ సూపరింటెండెంట్ రామారావు, రవికుమార్, ఈడీఎం శ్రీకాంత్, వివిధ సెక్షన్ల అధికారులు పాల్గొన్నారు.
- ఇదీ చూడండి:సన్న రకానికి మద్ధతు ధర ఇవ్వాలి: రైతులు