నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేస్తున్న ముఠాను భూపాలపల్లి జిల్లాలో పట్టుకున్నారు. చల్లగరిగె గ్రామానికి చెందిన బండిరాజు మరో నలుగురితో కలిసి ఎమ్మార్వో, ఆర్డీఓ సంతకాలు ఫోర్జరీ చేశారు. రైతుల వద్ద కమిషన్ తీసుకుని బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడ్డారు. విషయం తెలిసిన పోలీసులు తనిఖీలు చేసి నకిలీ పాసు పుస్తకాలు, తహశీల్దార్, ఆర్డీవో అధికారుల రబ్బరు స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని హన్మకొండలోని లలిత ప్రింటింగ్ ప్రెస్లో తయారు చేసినట్లు గుర్తించారు.
నకిలీ పాసుపుస్తకాలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నకిలీ పాస్ పుస్తకాల ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. నకిలీ పాసు పుస్తకాలు, తహశీల్దార్, ఆర్డీవో అధికారుల రబ్బరు స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు.
నకిలీ పాస్ పుస్తకాల ముఠా
ఇవీ చదవండి:బాబుమోహన్ కంటతడి