జయశంకర్ భూపాలపల్లిలో యువతపై మాదకద్రవ్యాల ప్రభావం లేకుండా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ కూరాకుల స్వర్ణలత ఆదేశించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి సాగు చేసే అవకాశాలున్నందున స్థానిక రెవెన్యూ అధికారుల సమన్వయంతో దాన్ని అడ్డుకోవాలని సూచించారు.
ప్రభావం లేదు..
జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన మాదకద్రవ్యాల నియంత్రణపై జిల్లా స్థాయి సమావేశం జరిగింది. జిల్లాలో వాటి ప్రభావం అంతగా లేదని అదనపు ఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి అక్రమంగా రవాణా జరిగే గంజాయిని గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతోందని వెల్లడించారు.