తెలంగాణ

telangana

ETV Bharat / state

హసన్‌పర్తి పంచాయతీలకు ట్రాక్టర్ల పంపిణీ - ప్రతిమ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ

హసన్‌పర్తి మండలంలో పలు పంచాయతీలకు ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ పల్లె ప్రగతి ట్రాక్టర్లను పంపిణీ చేశారు. సొంత గ్రామాలకు పయనమైన వలస కార్మికులు, కూలీలకు ఎమ్మెల్యే ఆహారం పొట్లాలను అందజేశారు. ప్రతిమ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మాస్కులను పంపిణీ చేశారు.

distribution-of-tractors-to-panchayats-in-hasanparthi
హసన్‌పర్తి పంచాయతీలకు ట్రాక్టర్ల పంపిణీ

By

Published : May 11, 2020, 3:15 PM IST

జయశంకర్ భూపాల పల్లి జిల్లా హసన్‌పర్తి మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో గంటూర్‌పల్లి, కొత్తపల్లి, సీతానాగారం, హరిశ్చంద్రనాయక్‌ పంచాయతీలకు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ పల్లె ప్రగతి ట్రాక్టర్లను పంపిణీ చేశారు.

నియోజకవర్గంలో అన్ని గ్రామపంచాయతీలకు ట్రాక్టర్లు అందజేశామని ఎమ్మెల్యే అన్నారు. సొంత గ్రామాలకు పయనమైన వలస కార్మికులు, కూలీలకు ఎమ్మెల్యే ఆహారం పొట్లాలను అందజేశారు. ప్రతిమ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మాస్కులను పంపిణీ చేశారు.

ఇవీ చూడండి:భారత్​లో కరోనా కొత్త రికార్డ్- ఒకేరోజు 4,213 కేసులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details